రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చే నెల రెండో తేదీన విశాఖ నగరానికి రానున్నారు. జల వనరుల నిర్వహణపై రుషికొండలోని రాడిసిన్ బ్లూ హోటల్‌లో జరగనున్న అంతర్జాతీయ సదస్సును కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండో తేదీ ఉదయం విజయవాడ నుంచి వచ్చి మధ్యాహ్నం తిరిగి వెళతారని జిల్లా అధికారులు శుక్రవారం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa