ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు పంచాయతీకి సంబంధించిన మంచినీటి చెరువుల నుంచి పొలాలకు నీరు అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రెటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొట్టిపాడు పంచాయతీ పరిధిలో పది చెరువులు ఉన్నాయని వాటిలో ఉన్న నీరు తాగునీటి అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలన్నారు. అలా కాకుండా కొందరు నాయకులు రూ. 1000 తీసుకొని అక్రమంగా పొలాలకు అమ్ముకుంటున్నారని ఫిర్యాదులో తెలిపారు.