ఈరోజు (శనివారం) విశాఖపట్నం, సింహాచలం అప్పన్న దేవాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా అర్చకులు మూసివేయనున్నారు. ఉదయం 6:30గంటల నుంచి మధ్యహ్నం 2:30 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. మధ్యహ్నం 2:30 గంటల తర్వాత దర్శనాన్ని నిలిపివేసి స్వామివారి తలుపులు కవాట బంధనం చేయనున్నారు. తిరిగి 29న ఆదివారం తెల్లవారుజామున ఆలయ సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమం చేసి ఉదయం 8:00 గంటల నుండి స్వామివారి దర్శనం పున:ప్రారంభంకానుంది. 29న ఉదయం స్వామివారికి సుప్రభాతం, ఆరాధనం, స్వర్ణపుష్పార్చనం, గరుడ సేవలు నిలుపదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa