ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని పైడిపాడులో పేకాట శిబిరంపై దాడి చేసి ఐదుగురు జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 10, 760 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ ఎస్సై దయాకర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెబ్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా పేకాట, కోడిపందాలు, అక్రమ మద్యం విక్రయాలు నిర్వహిస్తే చట్ట పరమైన చర్యలు చేపడతామని సెబ్ ఎస్సై దయాకర్ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa