విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో 10మందికిపైగా చనిపోయినట్లు చెబుతున్నారు.. వీరిలో పలువురి వివరాలను వెల్లడించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
1. గిరిజాల లక్ష్మి (35).
రామచంద్రాపురం.
జి. సిగడాం మండలం.
శ్రీకాకుళం జిల్లా.
2. కంచు భారతి రవి (30).
సన్/ఆఫ్ చిన్నారావు,
జోడుకొమ్ము (గ్రామం),
జామి (మండలం),
విజయనగరం జిల్లా.
3. చల్లా సతీష్ (32)
సన్ / ఆఫ్ చిరంజీవరావు (లేట్),
ప్రదీప్ నగర్,
విజయనగరం జిల్లా.
4. ఎస్. హెచ్. ఎస్. రావు
రాయగడ పాసింజర్ లోకో పైలట్.
ఉత్తరప్రదేశ్.
5. కరణం అక్కలనాయుడు (45)
సన్ / ఆఫ్ చిన్నయ్య,
కాపు సంబాం (గ్రామం),
గరివిడి (మండలం),
విజయనగరం జిల్లా.
6. ఎం. శ్రీనివాస్
- విశాఖ-పలాస పాసింజర్ రైలు గార్డు
7. చింతల కృష్ణమనాయుడు (35)
- దెందేరు గ్రామం, కొత్తవలస మండలం
- విజయనగరం జిల్లా
8. రెడ్డి సీతమనాయుడు (43)
- రెడ్డిపేట గ్రామం, చీపురుపల్లి మండలం
- విజయనగరం జిల్లా
9. మజ్జ రాము (30)
- గదబవలస గ్రామం
- గరివిడి మండలం, విజయనగరం జిల్లా
ఆరు మృత దేహాలు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో ఉండగా.. ఒక మృత దేహం మిమ్స్ ఆసుపత్రి మార్చరీలో ఉంది. ఈ ఘటనలో మొత్తం 50 మందికిపైగా ప్రయాణికులు గాయాలు కాగా.. వారిలో కొందరు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. మరికొందరు విశాఖ కెజిహెచ్ లో చికిత్స పొందుతున్నారు. అలాగే ఘటనా స్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. రైలు బోగీలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు.