ఉమ్మడి అనంతపురం జిల్లాలో 63 మండలాలు ఉండగా 49 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం వెల్లడించింది. జిల్లా అంతట కరువు పరిస్థితులు నెలకొన్న 14 మండలాలను మాత్రం ఆ జాబితాలో చేర్చలేదు. అనంతపురం జిల్లాలో 28, సత్యసాయి జిల్లాలో 21 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం గమనార్హం. ఎన్నడూ లేని విధంగా వర్షాలు లేకున్నా కొన్ని మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.