కడువకల్లు నుంచి తాడిపత్రి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కంపచెట్ల కొమ్మలు ఏపుగా పెరిగాయని పుట్లూరు బిజెపి ఓబీసీ మోర్చా రామంజి యాదవ్ పేర్కొన్నారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులకు కంపచెట్లు కంటికి తగిలే అవకాశం ఉందన్నారు. రోడ్డుకు ఇరువైపులా కంప చెట్లు ఉండటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు సమస్యను గుర్తించి వాహనాల సౌకర్యార్ధం మండల వ్యాప్తంగా కంపచెట్లను తొలిగించాలని అన్నారు.