కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన నేపథ్యంలో అందులో మీ పేరుందో. లేదో చెక్ చేసుకోండిలా. ఓటు జాబితాలో మీ పేరుందో. లేదో తెలుసుకోవడానికి 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయొచ్చు. https:eoandhra.nic.in వెబ్సైట్లోకి వెళ్లి మీ పేరును చెక్ చేసుకోవచ్చు. ఓటర్ల జాబితాలో పేరు లేదని గుర్తిస్తే ఓటరుగా నమోదు కోసం వెంటనే ఫారం-6 దరఖాస్తులు ఆన్లైన్లో లేదా నేరుగా సమర్పించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా 2024 జనవరి 5న నాటికి ఓటర్ జాబితాలో మీ పేరు చేరుతుంది.