విమాన ఇంధన ధరలను చమురు విక్రయ సంస్థలు పెంచాయి. ఒక్కో కిలోలీటరుపై అదనంగా మరో రూ.1,074 భారం వేశాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,11,344.92కు చేరుకుంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం గత 19 నెలలుగా ఎటువంటి మార్పు లేదు. వంటగ్యాస్, ఏటీఎఫ్ ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లు ప్రతినెల 1వ తేదీన సవరిస్తుంటాయి.