ఇసుకను ఉచితంగా ఇవ్వడమే చంద్రబాబు చేసిన నేరమా అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మద్యం ఇసుక దందాలపై టీడీపీ పోరాడుతూ ఉంటే చంద్రబాబు పై కేసులా అని ప్రశ్నించారు. అసలు లిక్కర్, ఇసుకలో అడ్డగోలుగా అవినీతి చేస్తున్నది సైకో జగన్ రెడ్డి అన్నారు.