ప్రకాశం జిల్లా కొండేపి మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో ఈనెల 4వ తేదీ శనివారం కంది, మిరప, శనగ, పొగాకు రైతులకు ఆయా పంటలపై శిక్షణ కార్యక్రమం ఉంటుందని అగ్రికల్చర్ అసిస్టెంట్ వెంకట రమణ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం అధికారి అన్నపూర్ణ, వ్యవసాయ అధికారులు పొల్గొంటారని ఆయన తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.