వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగు చేసిన పంటలను పలు జాగ్రత్తలు తీసుకుంటూ పంటలను కాపాడుకోవాలని దోర్నాల మండల వ్యవసాయాధికారి జవహర్ లాల్ నాయక్ అన్నారు. శుక్రవారం దోర్నాల సచివాలయం 3 పరిధిలో రైతులతో సమావేశం నిర్వహించారు. బెట్ట పడుతున్న పంటలకు అవసరమైన మోతాదులో మాత్రమే మందులు వాడాలని సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే ఆర్బికే సిబ్బందిని సంప్రదించి సలహాలు తీసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa