కార్తీకమాసంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక మాసమంతా అభిషేకాలు రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈనెల 14 నుంచి డిసెంబరు 12 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పర్వదినాలు, సెలవు రోజుల్లో అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించేందుకు కార్తీక మాసంలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు, వృద్ధ మల్లికార్జునస్వామి ఆర్జిత అభిషేకాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శని, ఆది, సోమవారాల్లో మల్లికార్జునస్వామి అలంకార దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు నాలుగు విడతలుగా రూ.500 స్పర్శ దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. స్పర్శ దర్శనం టిక్కెట్లను దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా పొందాల్సి ఉంటుందన్నారు. ఆర్జిత రుద్రహోమం, చండీహోమాలను రోజుకు రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు వివరించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో సూచించారు.
శ్రీశైలం వచ్చే భక్తులకు కార్తీకమాసంలో ఎలాంటి ఆ సౌకర్యాలు లేకుండా అన్ని అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఈవో ఆదేశించారు. కార్తీక దీపారాధన భక్తులకు ఆలయ ఉత్తర మాడ వీధిలో భక్తులు దీపాలు వెలిగించుకోవాలన్నారు. కార్తీక దీపారాధనకు భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో ఏర్పాటు చేయనున్నారు.. 27వ తేదీన కార్తీక పౌర్ణమి అయిన 26న పౌర్ణమి ఘడియలు రావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం నిర్వహించాలని నిర్ణయించారు.