ఏపీలో వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో వానలు పడతున్నాయి. మరో రెండు రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయి అంటున్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిలాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి అంటున్నారు.
తిరుపతి జిల్లా గూడూరులో 33.8 మిల్లీ మీటర్లు, శ్రీకాకుళం జిల్లా మందసలో 36.2, నెల్లూరు జిల్లా రాపూరులో 28.6, తిరుపతి జిల్లా తడలో 23.4, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో 23.4, ప్రకాశం జిల్లా ఒంగోలులో 23.3, నెల్లూరు జిల్లా కావలి 23, నెల్లూరు జిల్లా కందుకూరులో 22.4, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 17.6, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 14.6, విశాఖపట్నం 13.8, చిత్తూరు జిల్లా కుప్పంలో 11.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
కొన్ని జిల్లాల్లో వానలు కురుస్తుంటే.. మరికొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. అలాగే రాత్రి సమయంలో చలి వాతావరణం ఉంటోంది. పగలు ఎండ, రాత్రి చలితో జనాలు ఇబ్బందిపడుతున్నారు. అయితే వర్షాలు సరిగా లేకపోవడంతో.. సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం వానల పడటం కొంతమేర ఊరట అని చెప్పాలి.