‘నా ఎస్సీ.. నా ఎస్టీ’ అంటూ వారిపైనే సీఎం జగన్ దాడి చేస్తున్నారని TDP అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. SC, STలకు చెందిన పథకాలన్నీ జగన్ రద్దు చేశారని ఫైర్ అయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దళిత సమ్మేళన సభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి జగన్ తీరని నష్టం చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారు. రానున్న ఎన్నికల్లో పులివెందుల సహా అన్ని స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయం’ అని అన్నారు.