కరువుతో నిట్ట నిలువునా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు టిడిపి బృంద సభ్యులు వెళ్లడంతో వైసీపీ ప్రభుత్వానికి భయం ఎందుకు పుడుతుందని కళ్యాణదుర్గం టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు ప్రశ్నించారు. సోమవారం రాత్రి మడకశిరలో టిడిపి బృందసభ్యులను పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేసే ప్రయత్నంచేశారు. అందుకు నిరసనగా టిడిపి బృందం సభ్యులందరూ రోడ్డుపై పడుకొని పోలీసులకు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.