ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బాగా మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. తరగతి గదిలో కుర్చీలో నిద్రపోయాడు. స్థానికులు అక్కడకు వచ్చి ఆయనను నిద్ర లేపేందుకు ప్రయత్నించారు. అయితే ఆ టీచర్ లేవలేకపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ టీచర్ను సస్పెండ్ చేసినట్లు జిల్లా ప్రాథమిక విద్యా అధికారి అలోక్ సింగ్ వెల్లడించారు.