జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలి పల్నాడు కలెక్టర్ శివ శంకర్ వైద్య అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నరసరావుపేట కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ శివశంకర్, జిల్లా వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.