సోమవారం కర్నూలు కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీపావళి పండుగ సందర్భంగా జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేయనున్న బాణసంచా దుకాణాల ఏర్పాటుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ జి.కృష్ణకాంత్‌తో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.జి. సృజన మాట్లాడుతూ ..... బాణసంచా స్టాల్స్ ఏర్పాటు చేయడానికి లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఏమైనా నేర చరిత్ర ఉందా లేదా అని వెరిఫై చేసి లైసెన్సు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాణసంచా అమ్మకాలు జరిపే చోట రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా పని చేస్తూ ఎల్ ఆకారంలో స్టాల్స్ ఏర్పాటు చేయించాలన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవ్‌తేజ, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్వో మధుసూదన్ రావు, కర్నూలు ఆర్డీవో హరిప్రసాద్, పత్తికొండ ఆర్డీవో రామలక్ష్మి, సెక్షన్ సూపరింటెండెంట్ రామాంజనమ్మ పాల్గొన్నారు.