లష్కర్ తోయిబా మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్‌ను పాకిస్తాన్లో ఆగంతకులు కాల్చి చంపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. 2018 నుంచి 2020 వరకు లష్కర్ తోయిబా రిక్రూట్మెంట్ సెల్‌కు అక్రమ్ ఖాన్ నాయకత్వం వహించారు. భారత్‌కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు.