సారే జహా సే అచ్చా హిందూసితా హమారా గీతాన్ని రచించిన అల్లమా మహమ్మద్ ఇక్బాల్ జయంతిని అంతర్జాతీయ ఉర్దూ భాష దినోత్సవం గా జరుపుకోవటం హర్షణీయమని ప్రముఖ ఉర్దూ సాహితీవేత్త ఉర్దూ టీచర్ జనాబ్ షేక్ మహమ్మద్ ఖాసిం అన్నారు. గురువారం బాపట్ల ఉర్దూ పాఠశాలలో అంతర్జాతీయ ఉర్దూ భాష దినోత్సవం కార్యక్రమంలో మాట్లాడారు. ప్రముఖ సాహితీ వేత్త అబ్దుల్ ఖాదర్ జిలాని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉర్దూ11వ స్థానంలో ఉందన్నారు.