కర్నూల్ జిల్లా ధర్మవరంలో అవుకు జడ్పీటీసీ శ్రీలక్ష్మి పై అసభ్యకర పోస్టులు, ఫోన్ కాల్స్ వ్యవహారంలో కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సుధాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అవుకు తీసుకెళ్తుండగా సుధాకర్ రెడ్డి అనుచరులు పది కి.మీ.ల మేర కారు చేజింగ్ చేసి సుధాకర్ రెడ్డిని తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా అవుకు పోలీసులపై ధర్మవరం పోలీసుల ఫైర్ అవుతున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించకుండా ఏవిధంగా తీసుకెళ్తారంటూ అవుకు పోలీసులపై మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa