గృహోపకరణాల గ్యారెంటీ/వారెంటీపై తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వస్తువు కొన్న తేదీ నుంచి కాకుండా ఇన్స్టాలేషన్ తర్వాతి నుంచి వారెంటీ అమలయ్యేలా చూడాలని కోరింది. రిఫ్రిజిరేటర్లు, ACలు, వాషింగ్ మెషీన్లు వంటి గృహోపకరణాల విషయంలో కొనుగోలుకు, ఇన్స్టాలేషన్ కు మధ్య ఉన్న వారెంటీ కాలాన్ని వినియోగదారులు నష్టపోతున్నారని పేర్కొంది. పాలసీల్లో మార్పులు చేయాలని ఆయా కంపెనీలకు లేఖలు రాసింది.