రాజం నియోజకవర్గం లోని వంగర, సంతకవిటి, రేగిడి, రాజాము మండలం మరియు పట్టణంలో గల ప్రజలు శుక్రవారం ఘనముగా నాగుల చవితి వేడుకలను జరుపుకున్నారు. ఉదయం గ్రామాల్లోని పుట్టల వద్దకు వెళ్లి పుట్టలను శుభ్రం చేసి, నాగులకు పాలు, నువ్వులు బెల్లంతో చేసిన చిమిలి, వడపప్పు నైవేద్యముగా సమర్పించుకున్నారు. కొంతమంది పుట్టలలో నాటు కోడిగుడ్లను వేశారు. తమ పిల్లలు తెలియక ఎటువంటి అపచారం చేసిన చల్లగా చూడాలని మొక్కుకున్నారు.