శ్రీకాకుళం జిల్లా బూరవల్లి గ్రామంలోని ప్రజలు నేడు నాగుల చవితి పండగను జరుపుకోవడంలేదు. పూర్వం ఊరి పేరు చివరన 'వల్లి' అని ఉన్న ప్రాంతాల్లో చవితి రోజున కాకుండా షష్ఠి రోజున పూజలు చేసేవారని గ్రామస్థులు చెబుతున్నారు. తమ పూర్వీకుల ఆనవాయితీని పాటిస్తున్నామని గ్రామస్థులు చెబతున్నారు. కాగా ఏటా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున గ్రామస్థులు పుట్టకు పూజలు చేస్తారు.