తన మనవరాలి వయసున్న ఓ బాలిక(13)ను వృద్ధుడు గర్భిణిని చేశాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా వేటపాలెంలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు వెంకటేశ్వర్లు వయసు దాదాపు అరవై సంవత్సరాల పైనే ఉంటుంది. ఇతని ఇంటి పక్కన నివాసం ఉండే ఓ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటానని మాయ మాటలు చెప్పి బాలికను లోబర్చుకున్నాడు. వృద్ధుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
![]() |
![]() |