వైద్య చరిత్రలో ఒక ఊహించని అద్భుతం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ జిల్లాలో 41 ఏళ్ల మహిళ పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చింది, వైద్యులు ఆమె కవలలతో గర్భవతిగా గుర్తించారు. తల్లి గర్భం దాల్చిన 18 వారాలకే గుండె సమస్య కారణంగా కవల పిండం చనిపోయింది. మరో పిండం ఆరోగ్యంగా ఉండడంతో తల్లికి ఎలాంటి హాని కలగకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. 125 రోజుల తర్వాత ఈ నెల 14న అసాధారణ శస్త్రచికిత్స చేసి మగబిడ్డను బయటకు తీశారు.