ఈ నెల 22 నుంచి ప్రస్తుతం సంబల్‌పూర్-బెనారస్-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌గా నడుస్తున్న రైలును విశాఖపట్నం వరకూ పొడిగించునున్నారు. ఇది దక్షిణ ఒడిశా ప్రాంతీయులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ రైలు విశాఖ నుంచి బలంగిర్, టిట్లాఘర్, రాయగడ మీదుగా వెళుతుంది. కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ రైలును ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు సంబల్‌పూర్‌లో జెండా ఊపి ప్రారంభిస్తారని రైల్వే వర్గాలు తెలిపాయి. బెనారస్-విశాఖపట్నం (నంబర్ 18311 నంబర్) రైలు విశాఖపట్నం నుంచి ప్రతి బుధ, ఆదివారాల్లో ఉదయం 4.20 గంటలకు బయలుదేరుతుంది. మరుసటిరోజు ఉదయం 9.25 గంటలకు బనారస్ చేరుతుంది. ఈ నెల 22 నుంచి ఈ రైలు ప్రారంభమవుతుంది. తిరుగు ప్రయాణంలో 18312 నంబరుతో ప్రతి గురు, సోమవారాల్లో మధ్యాహ్నం మూడు గంటలకు బెనారస్‌లో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 7.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.