వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క దళిత, గిరిజనుడికి ఎక్కడా సెంటు భూమిని కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...తన తండ్రి ఆక్రమించుకున్న అసైన్డ్ ల్యాండ్స్ దళితులకు పంచే ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. ఇడుపులపాయలో తమపరిధిలో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి చెప్పి దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది. చీమల పుట్టల్లోకి పాములు దూరినట్టు నాలుగేళ్ల జగన్ పాలనలో వైసీపీనేతలు దళితులు..ఇతరవర్గాల భూముల్ని ఆక్రమించుకున్నారన్నారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలు కొట్టేసిన 40వేల ఎకరాలను పేదలకు పంచే ధైర్యం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు.