టెన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయిలకు నందమూరి తారక రామారావు మెమోరియల్ ట్రస్ట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతిభ గల విద్యార్థినులకు స్కాలర్ షిప్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఓ ప్రకటన విడుదల చేశారు. NTR Trust GEST 2024కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె ప్రకటనలో వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్‌షిప్ కేవలం బాలికలకు మాత్రమే. పరీక్షల్లో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలు స్కాలర్‌షిప్ ప్రయోజనం పొందుతారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మొత్తం 25 మంది బాలికలు ఏపీ, తెలంగాణలో రెండేళ్ల పాటు ఇంటర్మీడియట్ చదవటానికి స్కాలర్‌షిప్ ఇస్తారు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. అందుకు సంబంధించిన టెస్ట్ (GEST -2024)ను డిసెంబర్ 17న నిర్వహించనున్నట్లు తెలిపారు. టెన్త్ చదవి విద్యార్థులు ఈ నెల 18 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ఆసక్తిగల వారు www.ntrcollegeforwomen.education వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.