ఉత్తరాఖండ్ సొరంగం ప్రమాద ఘటనలో చిక్కుకున్న కూలీల క్షేమ సమాచారం కోసం వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో టన్నెల్‌లోకి పంపిన పైప్ ద్వారా కుటుంబసభ్యులతో పలువురు మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాకు చెందిన విక్రమ్ సింగ్ (25) తన సోదరుడితో మాట్లాడుతూ... తాను సొరంగంలో చిక్కుకున్న విషయం అమ్మకు చెప్పొదని అన్నాడు. అమ్మకు తెలిస్తే చాలా ఆందోళన పడుతుందని, నేను క్షేమంగానే ఉన్నానని తెలిపాడు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన శత్రుఘ్నలాల్, మంజీత్‌లు కుటుంసభ్యులతో సంభాషించారు. తాము క్షేమంగా ఉన్నామని, ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.
మంగళ, గురువారాల్లో కూడా ఇద్దరు కూలీలు అధికారులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాగా, టన్నెల్ పనులను కేంద్ర ప్రభుత్వంతో కలిసి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ చేపడుతోంది. చన్నీగోత్ గ్రామానికి చెందిన విక్రమ్ సింగ్‌కు శుక్రవారం అన్నతో కొద్దిసేపు మాట్లాడే అవకాశం లభించింది. మా అమ్మను బాధపెట్టకూడదని కన్నీటి పర్యంతమయ్యాడు. ‘కొద్ది సెకెన్లు మాత్రమే మేము మాట్లాడం.. అతని ఆరోగ్యం గురించి అడిగాను.. బయట కొనసాగుతున్న రెస్క్యూ గురించి వివరించాను... మా చిన్న తమ్ముడు.. వాడు మాకు ఎంతో ఇష్టం’ అని అతడి సోదరుడు విక్రమ్ అన్నారు. నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడంతో లోపలి చిక్కుకున్న 40 మందిలో ఒకరైన విక్రమ్ సింగ్ ఉత్తరాఖండ్ రోడ్‌వేస్‌లో పనిచేస్తున్నాడు. సోదరుడు లోపలి చిక్కుకున్న విషయం తెలియగానే కుటుంసభ్యులు అక్కడకు చేరుకున్నారు. ఇటీవలే సెలవుపై ఇంటికి వచ్చిన విక్రమ్ సింగ్.. ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసి స్థానికులు షాక్‌కు గురయ్యారు.