యూపీలో అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనులన్నీ పూర్తయితే ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుందని L&T నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ వినోద్ మెహతా తెలిపారు. ‘‘2024 జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అందుకు వీలైనంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం స్తంభాలపైన శిల్పకళాకృతులు చెక్కుతున్నారు’’ అని మెహతా పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa