వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిపోయాయి. సామాజిక న్యాయం మాత్రం నినాదంగానే మిగిలిపోయింది. మన రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి కాగానే పరిస్థితి మారిపోయింది. సామాజిక సాధికారత అన్నది ఒక విధానం అయింది. తన మంత్రివర్గంలో 17 మందిని అంటే 70 శాతం మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చోటిచ్చిన జగనన్న. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో.. నాలుగింటిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించారు. అణగారిన వర్గాలను చేయిపట్టి ముందుకు నడిపిస్తున్న జగనన్న, నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఏనాడు బీసీలు గుర్తురాలేదు. మైనార్టీలు గుర్తుకు రాలేదు. ఎస్సీ, ఎస్టీలు గుర్తుకు రాలేదు. అలాంటిది ఇప్పుడు బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ అంటే నమ్మేదెవరు? మళ్లీ ప్రజల ముందుకు వస్తున్న బాబు గతాన్ని మరిచిపోవద్దు. హామీలిచ్చి ఎగ్గొట్టే నైజం చంద్రబాబుది అని అన్నారు.