విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి రెండు గంటలకు జరిగిన ప్రమాదంలో అధిక సంఖ్యలో బోట్లు దగ్ధమయ్యాయి. మత్స్యకారులు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూశారు. సుమారు రూ. 40 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలాగురువులు సోమవారం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మత్స్యాకారులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.