విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో చెలరేగిన మంటలకు 40కి పైగా బోట్లు దహనమైన విషయం తెలిసిందే. బాధితులకు న్యాయం చేయాలంటూ మత్స్యకార నాయకులు హార్బర్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని.. వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ సాయంత్రంలోపు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి తమకు న్యాయం చేయాలన్నారు. బోటుకు రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.