విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్లో అర్థరాత్రి చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 40 బోట్లు దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన బోట్ల యజమానులను కొత్త బోట్లు, మెరుగైన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.