ధర్మవరం పట్టణంలోని ఎస్ బి ఐ కాలనీ సచివాలయం లో పనిచేస్తున్న ఏ ఎన్ ఎం అనిత, ఆశ వర్కర్ సరస్వతి లు గత నాలుగు సంవత్సరాలుగా వార్డ్ ప్రజలకు అందించిన వైద్య సేవలకు గుర్తింపుగా 21 వ వార్డ్ కౌన్సిలర్ కత్తే ఆదిలక్ష్మి వార్డ్, ఇంచార్జీ కత్తే పెద్దన్న ఆధ్వర్యంలో సోమవారం సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్, కన్వీనర్లు, గృహసారదులు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.