వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కార్ బీసీలకు నమ్మక ద్రోహం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నిరంగాల్లో బీసీలను సీఎం జగన్ అణగదొక్కారని ఆరోపించారు. మన్యం జిల్లా పార్వతీపురంలో సోమవారం జరిగిన బీసీ సదస్సులో ఆయన మాట్లాడారు. బీసీల్లో ఐక్యత ఉంటే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పొందగలమని వ్యాఖ్యానించారు.