కాకినాడ జిల్లాలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం ఐదుగురు మత్స్యకారులు నాటు పడవపై చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లారు. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో పాటుగా సముద్ర అలద బెబ్కు పడవ ప్రయాణం సాగడానికి అనుకూలించలేదు. ఈ క్రమంలో పడవ బోల్తా పడటంతో ఐదుగురు జార్లు సముద్రంలో గల్లంతయ్యారు. ముగ్గురు జాలరులు ఎలాగోలా ఈదుకుంటూ తీరానికి చేరుకున్నారు. వీరిలో సూర్యారావు పేటకు చెందిన గరికిన సత్తిరాజు.. దుమ్ములపేటకు చెందిన మైలపల్లి కృప దాసు అలల దెబ్బకు గల్లంతయ్యారు. ఈ విషయం తెలియడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. వెంటనే రంగంలోకి మెరైన్ సిబ్బంది రంగంలోకి దిగి తమవారిని కాపాడాలని వారు కోరుతున్నారు. స్థానిక మత్స్యకారులు కూడా తమవంతుగా గాలింపు మొదలు పెట్టారు. ఇవాళ(నవంబర్ 21) ప్రపంచ మత్స్యకార దినోత్సవం.. అయితే ఈ క్రమంలో సోమవారం విశాఖ హార్బర్‌లో అగ్నిప్రమాద ఘటన మరవక ముందే మత్స్యకారులు గల్లంతు కావడంతో ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉందంటున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.