విశాఖపట్నంలో పెళ్లైన నెలకే యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మన్యం జిల్లా, పార్వతీపురం మండలం జమదాలకు చెందిన కల్యాణికి అదే ప్రాంతానికి చెందిన రాంబాబుతో గత నెల 22న పెళ్లైంది. ఉపాధి నిమిత్తం విశాఖపట్నం వచ్చి చంద్రనగర్లో ఉంటున్నారు.
భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా గురువారం కల్యాణి తన స్వగ్రామానికి వెళ్తానని చెప్పడంతో మధ్యాహ్నం రాంబాబు సింహాచలం రైల్వేస్టేషన్లో విడిచిపెట్టి వెళ్లాడు. కొద్దిసేపటికే ఆమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.