ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరి నదిపై నిర్మించిన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.
నాలుగున్నర కిలోమీటర్లు పొడవైన రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్రిడ్జి. ఈబ్రిడ్జిని 1974 లో అప్పటి రాష్ట్రపతి ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేశారు. ఇది గోదారమ్మకు మణిహారం. ఉభయ గోదావరి జిల్లాలను కలిపిన ఆత్మీయ వారథిగా చెప్పుకుంటారు.