విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం సోషల్ మీడియాలో అగ్ని ప్రమాదానికి ముందు సీసీ ఫుటేజ్ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు రాత్రి 10:48 నిమిషాలకు బోటు నుంచి బయటికి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇద్దరు అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. ఫిషింగ్ హార్బర్ ప్రమాదానికి గల కారణలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పు చేప వండినప్పుడు మంట ఎక్కువ అయినందున ప్రమాదం జరిగి ఉండొచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. బోటులో పార్టీ చేసుకున్న తర్వాత వాళ్లు కాల్చిన సిగరెట్ చేపల వలపై పడిందని... దీంతో గాలుల కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని మరో అనుమానం వ్యక్తమవుతోంది. ఇంతవరకూ ప్రమాద ఘటనపై పోలీసులకు పూర్తి క్లారిటీ రాలేదు. కారణాలపై అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఆ చుట్టుపక్కల వారు సుమారుగా 26 వరకూ కెమెరాలు ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో కెమెరాలు పనిచేయకపోవటమే ఒక కారణమన్నారు. మరిన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.