వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగాఅయన స్పందిస్తూ.... ‘‘అయ్యా జగన్ గారు... విశాఖ ఎందుకొస్తున్నారు... దేనికోసం వస్తున్నారు. ఇలా అడ్డదారిలో రావాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పండి....? ప్రశాంత నగరంగా పేరున్న విశాఖ మీ రాజధాని ప్రకటనతో అరాచకాలకు అడ్డాగా మారింది. పులివెందుల పంచాయితీలు నడుస్తున్నాయి. ఎప్పుడు మీ స్వార్థం, మీ రాజకీయ లబ్ధి తప్పా.. మా విశాఖ ప్రజల మనోవేదన మీకు పట్టడంలేదు. ఈ మూడు నెలల ముచ్చట కోసం వేల కోట్ల ప్రజా ధనాన్ని తగలేస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ రాజధానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టండి నూటికి 99% మంది ప్రజలు రాజధాని వద్దనే చెబుతారు. ఎన్నికలకు మూడు నెలల ముందు విశాఖ వచ్చి ఏమి సాదిద్దాం అనుకుంటున్నారు. రాజధాని అమరావతేనని, అక్కడి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించవద్దని హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పినా జగన్ మోహన్ రెడ్డి వక్రబుద్ధితో అడ్డదారిన ఈ తరలింపు ఎవరికోసం. ఆ ఆదేశాలు అమల్లో ఉండగానే దొడ్డిదారిన జీవో ఇవ్వడం కోర్టుధిక్కారం కాదా....? మీ పాలనకు ఇక 3 నెలలు ఎక్స్పైరీ డేట్ మాత్రమే మిగిలి ఉందని గుర్తుంచుకోండి’’ అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.