ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 25, 2023, 12:26 PM

‘రాష్ట్రంలో దళితులను ఊచకోత కోస్తున్నారు. దళిత ఆడబిడ్డలను హత్యాచారం చేసి హతమారుస్తున్నారు. దళితజాతి ప్రస్థానం ఎక్కడకు పోతోంది?’ అంటూ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో గురువారం ‘దళిత శంఖారావం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ అధికారంలోకివచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో దళితులపై దాడుల సంస్కృతి పెచ్చుమీరింది. ఏకంగా దళితుడ్ని హతమార్చి డోర్‌డెలివరీ చేసిన ఎమ్మెల్సీని కనీసం ముఖ్యమంత్రి కూడా ఏమీ అనకపోవడం అత్యంత దారుణం. జగన్‌ దళితద్రోహి అన్నది ప్రతిఒక్కరు గుర్తించాలి. దళితులంతా వైసీపీని వ్యతిరేకించాలి’ అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రతిభాభారతి, మాజీమంత్రి కోండ్రు మురళీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిలు, మాజీఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, ఎస్సీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com