వైయస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సామాజిక సాధికార యాత్ర సోమవారం రెండు ప్రాంతాల్లో జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైయస్ జగన్ చేసిన మేలును, అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ సాగుతున్న సామాజిక సాధికార యాత్ర విశేష ప్రజాదరణ పొందుతోంది. ఇందులో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది.