అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో యువగళం పాదయాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని చూసేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్‌కి జనం అభివాదం చేస్తున్నారు. మహిళలు, యువత, వృద్ధులను కలుస్తూ వారి సమస్యలను నారా లోకేష్ తెలుసుకుంటున్నారు. విద్యుత్ ఛార్జీల బాదుడు తట్టుకోలేకపోతున్నామని.. లోకేష్ వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్, ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ ప్రభుత్వం సామాన్యుడిపై పెను భారం మోపిందని నారా లోకేష్ పేర్కొన్నారు. పెరిగిన ఖర్చులతో బతకడం కష్టంగా మారిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మా పై భారం తగ్గించాలని లోకేష్‌ను మహిళలు కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందిస్తామని లోకేష్ తెలిపారు. జగన్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేశాడని... బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
![]() |
![]() |