వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర లో భాగంగా నేడు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు నందివానివలసలో వైయస్ఆర్ సీపీ నేతలు విలేకర్ల సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 2 గంటలకు పెదమేరంగి, సీమనాయుడువలస మీదుగా బైకు ర్యాలీ జరగనుంది. 3 గంటలకు కురుపాం పోలీస్ స్టేషన్ జంక్షన్లో జరిగే బహిరంగ సభలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు సీదిరి అప్పలరాజు తదితరులు పాల్గొననున్నారు.