వైసీపీ పార్టీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.... బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేద అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు ఒక్కతాటిపైకి వచ్చి జగనన్న పక్షాన ఉన్నామని నిరూపించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని సామాజిక ధర్మాన్ని జగనన్న చేసి చూపాడని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చెబుతున్నారు. 14 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉండి తాను ఇలా చేశానని చెప్పే ధైర్యం ఉందా? కైకలూరులో జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ ఇచ్చిన జగనన్న. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభలో కూర్చోబెట్టిన ఘనత మన జగనన్నది. మంత్రివర్గంలో 17 పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే. జ్యోతిరావు పూలే, అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ ఆలోచన విధానాలను ఆచరణలో చూపించిన జగనన్న. 2014లో ఇచ్చిన మేనిఫెస్టోకి సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఓటు అడగాలి. 2019 వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో 99 శాతం వాగ్దానాలను నెరవేర్చిన ఘనత జగనన్నది అని తెలియజేసారు.