రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్ల గ్రామానికి చెందిన బీజేపీకు చెందిన 70 కుటుంబాలు మంగళవారం అఖిలప్రియ సమక్షంలో టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయారన్నారు. కార్యక్రమంలో టీడీపీలో చేరిన చిన్నస్వామి, హరి, నడిపెన్న, పెద్దన్న, ఓబులేసు తదితరులు, టీడీపీ నాయకులు విఖ్యాత్‌రెడ్డి, భార్గవ్ రామ్‌నాయుడు, శేఖర్‌రెడ్డి, బాలపుల్లారెడ్డి, నరసింహుడు పాల్గొన్నారు.