‘నా ఎస్సీలు, నా బీసీలు అంటూ కపట ప్రేమను ఒలకబోస్తున్న జగన్... ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే దళితులను ఊచకోత కోస్తూ రాక్షసానందం పొందుతున్నాడు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ముమ్మడివరం నియోజకవర్గం పల్లెపాలెం సెంటర్‌లో యువ నేత లోకేష్‌ను ఎస్సీ సామాజిక వర్గీయులు కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేయడమేగాక రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని అన్యాయం చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కారు రద్దు చేసిన 27న ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తామన్నారు. దళితులను వేధించిన వైసీపీ నేతలు, పోలీసులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa